రచయితగా విజయ్‌ దేవరకొండ?


Mon,June 17, 2019 11:47 PM

Vijay Devarakonda To Narrate 3 Stories

పైన హెడ్డింగ్‌ చూసి విజయ్‌ దేవరకొండ ఏ సినిమా కోసమో రచయితగా మారుతున్నాడనుకుంటే పొరపడినట్లే. అసలు విషయం ఏమిటంటే...తాను కథానాయకుడిగా నటిస్తున్న ఓ సినిమాలో విజయ్‌ రచయిత పాత్రలో కనిపించబోతున్నారు. వివరాల్లోకి వెళితే..క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. రాశీఖన్నా, ఐశ్వర్యరాజేష్‌, ఇజాబెల్లె కథానాయికలు. ముక్కోణపు ప్రేమకథగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ రచయిత పాత్రను పోషిస్తున్నారని సమాచారం. ఆయన రాసిన మూడు కథలు వెండితెరపై ఆవిష్కృతమవుతాయట. వాటిలో ఆయనే హీరోగా కనిపించడం కథలో ఆసక్తికర అంశమని సమాచారం. సినిమాలో రచయిత పాత్రధారి రాసిన కథలు తెరపై ప్రాణం పోసుకునే కాన్సెప్ట్‌తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. తాజాగా అదే కాన్సెప్ట్‌ను ఈ సినిమాలో రొమాంటిక్‌ హంగులతో వినూత్నంగా ఆవిష్కరించబోతున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ చిత్రం ఫ్రాన్స్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్నది.

2602

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles