నోటాకు డేట్ ఫిక్స్!


Sat,September 22, 2018 11:16 PM

Vijay Devarakonda s Tamil debut NOTA to release on Oct 5

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ద్విభాషా చిత్రం నోటా. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మెహరీన్ కథానాయిక. స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. సమకాలీన రాజకీయాంశాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర విడుదల తేదీని చిత్ర బృందం శనివారం ఖరారు చేసింది. అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

నిర్మాత మాట్లాడుతూ అర్జున్‌రెడ్డి, గీత గోవిందం వంటి బ్లాక్‌బస్టర్ విజయాల తరువాత విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో సినిమా వుంటుంది. తమిళంలో తన పాత్రకు విజయ్ దేవరకొండ డబ్బింగ్ చెప్పుకున్నారు. మెహరీన్ జర్నలిస్టుగా కనిపిస్తుంది. సమకాలీన రాజకీయాంశాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా ఆకట్టుకుంటుంది అన్నారు. సత్యరాజ్, నాజర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: షాన్ కురుప్పుసామి, సంగీతం: శ్యామ్ సిఎస్, ఛాయాగ్రహణం: శాంతన కృష్ణన్, ఎడిటింగ్: రేమండ్ డెరిక్ కాస్ట్రా.

2574

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles