అందరి కలల్ని నిజం చేసింది!

Sun,November 3, 2019 12:16 AM

ఈ రోజు జరుగుతున్న వేడుకకు చాలా కారణాలున్నాయి. ఎందుకంటే మా అందరి కలలు ఈ సినిమాతో నిజమయ్యాయి. ఎందరో నటీనటులు, సాంకేతిక నిపుణులు డ్రీమ్స్ అన్నీ నెరవేరాయి అన్నారు విజయ్ దేవరకొండ. కింగ్ ఆఫ్ ది హిల్స్ పతాకంపై ఆయన నిర్మించిన చిత్రం మీకు మాత్రమే చెప్తా. తరుణ్‌భాస్కర్ కథానాయకుడిగా పరిచయమైన ఈ చిత్రానికి షమ్మీర్ సుల్తాన్ దర్శకుడు. ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. శనివారం ఫన్ స్టాటిక్ పేరుతో వేడుక నిర్వహించారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఇండస్ట్రీలో నాకు స్థానం దొరుకుందో లేదో అనే పరిస్థితుల నుంచి..ఈ రోజు సినిమాను నిర్మించే స్థాయికి రావడంతో నా కల నిజమైందనే భావన కలుగుతున్నది. నైజాంలో ఎనభైశాతం థియేటర్లు ఫుల్ అయ్యాయి. థియేటర్లన్నీ నవ్వుల్లో నిండిపోయినప్పుడు అంతకు మించిన సంతృప్తి మరొకటి ఉండదు. ఇప్పుడు ప్రతీ విషయంలో జీవితం ఒత్తిడిగా మారిపోయింది.


వారంతాల కోసం అందరం ఎదురుచూస్తున్నాం. ఈ సినిమా స్ట్రెస్ నుంచి ఉపశమనం కలిగించి నవ్వుల్ని పంచుతుంది. సృజన్ అనే కొత్త దర్శకుడితో మా బ్యానర్‌లో మరో సినిమా ఉంటుంది అన్నారు. ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాను. థియేటర్లకు వెళితే అందరి ముఖాల్లో నవ్వులు కనిపిస్తున్నాయి. రైటింగ్ విషయంలో తరుణ్‌భాస్కర్ చాలా సహకరించారు అని దర్శకుడు తెలిపారు. తరుణ్‌భాస్కర్ మాట్లాడుతూ ప్రేమతో, ఇష్టంతో చేసే పనిలో దేవుడుంటాడు. ఆ పని విజయవంతమవుతుంది. అంతటి ఇష్టంతో చేసిన పనికి తప్పకుండా మంచి ఫలితం దక్కుతుందని ఈ సినిమా నిరూపించింది అన్నారు. థియేటర్లో ప్రేక్షకుల స్పందన చూస్తుంటే మా అంచనాలన్నీ నిజమయ్యాయనే ఫీలింగ్ కలుగుతున్నదని అభినవ్ గోమఠం చెప్పారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.

476

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles