విజయ్‌దేవరకొండ హీరో


Wed,March 13, 2019 11:28 PM

Vijay Devarakonda New Movie Hero To Roll Out In April 22

విజయ్‌దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో హీరో పేరుతో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నది. ఈ చిత్రం ద్వారా ఆనంద్ అన్నామలై దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఏప్రిల్ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ సినిమా ప్రారంభోత్సవ తేదీ, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్, మోహన్ (సీవీఎం). ఇదిలావుండగా విజయ్‌దేవరకొండ తాజా చిత్రం డియర్ కామ్రేడ్ టీజర్‌ను ఈ నెల 17న నాలుగు దక్షిణాది భాషల్లో విడుదల చేయబోతున్నారు.

1379

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles