డియర్ కామ్రేడ్ డేట్ ఫిక్స్!


Wed,May 8, 2019 11:40 PM

vijay devarakonda dear comrade movie release date confirmed

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం డియర్ కామ్రేడ్. ఫైట్ ఫర్ వాట్ యు లవ్ ఉపశీర్షిక. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్‌బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి(సి.వి.ఎం), యశ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భరత్ కమ్మ దర్శకుడు. గురువారం విజయ్‌దేవరకొండ పుట్టినరోజును పురస్కరించుకొని సినిమాను జూలై 26న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకే రోజున చిత్రాన్ని విడుదలచేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ తిరుగుబాటు మనస్తత్వం కలిగిన వైద్య విద్యార్థి కథ ఇది. ప్రేమించిన వాటి కోసం అతడు సాగించిన సమరానికి అందమైన దృశ్యరూపంగా ఉంటుంది.

లిల్లీ అనే క్రికెటర్‌తో అతడు ఎలా ప్రేమలో పడ్డాడు? వారి ప్రేమకు ఎలాంటి అవరోధాలు ఎదురయ్యాయన్నది ఆకట్టుకుంటుంది. విజయ్ దేవరకొండ పాత్ర నవ్యరీతిలో ఉంటుంది. నాయకానాయికల కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు, గీతానికి చక్కటి స్పందన లభించింది. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్, సంభాషణలు: జె.కృష్ణ.

1549

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles