విజయ్-పూరి ‘ఫైటర్’


Thu,August 22, 2019 11:54 PM

Vijay Devarakonda and Puri Jagannadh Movie Titled Fighter

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఫైటర్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నది. పూర్వ నిర్మాణ పనులన్నింటిని పూర్తిచేసుకొని జనవరిలో చిత్రాన్ని సెట్స్‌మీదకు తీసుకొస్తాం. పూరి శైలి యాక్షన్ అంశాలతో వినూత్నమైన ప్రజంటేషన్‌తో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాం. విజయ్ దేవరకొండలోని మరో కోణాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నాం అని చిత్రబృందం తెలిపింది. ఇటీవలే విడుదలైన ఇస్మార్ట్‌శంకర్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు పూరి జగన్నాథ్. ఈ నేపథ్యంలో పూరి-విజయ్‌దేవరకొండ కాంబినేషన్‌లో రాబోతున్న తాజా చిత్రం ప్రేక్షకులతో పాటు పరిశ్రమ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది.

876

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles