ఫైటర్‌కోసం మార్షల్ ఆర్ట్స్


Sun,August 25, 2019 12:44 AM

vijay devarakonda and puri jagannadh film titled fighter

తన సినిమాల్లోని కథానాయకుల్ని అత్యంత శక్తివంతులుగా, ధైర్యశాలురుగా ఆవిష్కరిస్తుంటారు దర్శకుడు పూరి జగన్నాథ్. హీరో పాత్ర చిత్రణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. విజయ్‌దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ ఫైటర్ పేరుతో ఓ చిత్రానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఈ చిత్రంలో విజయ్‌దేవరకొండ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా కనిపించబోతున్నారు. ఇందుకోసం ఆయన ఓ ట్రైనర్ ఆధ్వర్యంలో మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకోబోతున్నారు. చిత్రీకరణకు ఇంకా నాలుగునెలల సమయం ఉండటంతో అత్యంత సవాలుతో కూడిన శిక్షణకు ఆయన సిద్ధమవుతున్నారని తెలిసింది. వినోదం, యాక్షన్ అంశాలు మేళవించిన కథ ఇది. అయితే మార్షల్ ఆర్ట్స్ కథాగమనంలో కీలకంగా ఉంటుంది. ఓ రకంగా సినిమాకు ఆయువుపట్టులా నిలుస్తుంది. అందుకే విజయ్‌దేవరకొండ ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టిపెట్టాలని నిర్ణయించుకున్నాం అని చిత్రబృందం చెబుతున్నది. మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా విజయ్‌దేవరకొండ కొత్త అవతారం ఎలా ఉండబోతుందో చూడాలంటే వచ్చే ఏడాది వేసవి వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం ఫైటర్ స్క్రిప్ట్‌కు తుదిమెరుగులుదిద్దే పనిలో దర్శకుడు పూరి జగన్నాథ్ బిజీగా ఉన్నారని తెలిసింది.

593

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles