విజయ్ దేవరకొండ ‘హీరో’ షురూ!


Mon,May 20, 2019 04:15 AM

vijay-devarakonda-and-malavika-mohanan-starrer-hero-launched

క్రేజీ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ నటిస్తున్న మరో చిత్రం హీరో చిత్రీకరణ ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. అన్నామలై దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మాళవికా మోహనన్ కథానాయిక. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం విజయ్ దేవరకొండ, మాళవిక మోహనన్‌లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి దర్శకుడు కొరటాల శివ క్లాప్ నిచ్చారు. ఎమ్మెల్యే రవికుమార్ కెమెరా స్విఛాన్ చేశారు. క్రీడా నేపథ్యంలో సాగే మ్యూజికల్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ చిత్రం ద్వారా తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించి పేరుతెచ్చుకున్న మాళవిక మోహనన్ తెలుగు చిత్రసీమలో కథానాయికగా అరంగేట్రం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ తొలిసారిగా డిఫరెంట్ జోనర్‌లో నటిస్తున్న చిత్రమిది. ఆయన పాత్ర చిత్రణ నవ్యపంథాలో సాగుతుంది అని చిత్ర బృందం పేర్కొంది. దిగంత్ మచాలే, వెన్నెల కిషోర్, సరన్ శక్తి, రాజా కృష్ణమూర్తి, జాన్ ఎడా తట్టిల్ తదితరులు నటిస్తున్నారు. చిత్రానికి కెమెరా: మురళీ గోవిందరాజులు, సంగీతం: ప్రదీప్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్స్ మౌనిక, రామకృష్ణ, స్టంట్: శంకర్ ఉయ్యాల, వీఎఫ్‌ఎక్స్: యుగంధర్.టి.

2247

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles