రిలీజ్‌కు ముందే పదినిమిషాల సినిమా!


Tue,November 14, 2017 10:52 PM

indrasena
బిచ్చగాడు చిత్రంతో తెలుగు, తమిళ భాషల్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు విజయ్ అంటోని. ఆయన నటిస్తున్న తాజా తమిళ చిత్రం అన్నాదురై. జి.శ్రీనివాసన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. డైనా చంపిక, మహిమ, జ్వెల్ మ్యారీ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఇంద్రసేన పేరుతో ఎన్.కె.ఆర్. ఫిలింస్ అధినేత నీలం కృష్ణారెడ్డి తెలుగులో అందిస్తున్నారు. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నీలం కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ సినిమా అంచనాల్ని పెంచింది. బిచ్చగాడు చిత్రానికి మించిన కథ, కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆ నమ్మకంతోనే భారీ మొత్తం చెల్లించి ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన థియేటర్ హక్కుల్ని సొంతం చేసుకున్నాం. ఈ నెల 16న భారీ స్థాయిలో ఆడియోను విడుదల చేసి అదే సమయంలో చిత్రానికి సంబంధించిన పదినిమిషాల సినిమాను ప్రదర్శిస్తాం. ఓ మాస్ సాంగ్‌ను కూడా విడుదల చేస్తాం. ఈ పాటను మాస్ మహారాజా రవితేజ రిలీజ్ చేస్తారు. మా సంస్థ విడుదల చేసిన ఇంకొక్కడు, జయమ్ము నిశ్చయమ్మురా చిత్రాల తరహాలోనే ఈ సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకముంది అన్నారు. రాధారవి, కాళీ వెంకట్, నళినీకాంత్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు, పాటలు: భాష్యశ్రీ, ఆర్ట్: ఆనంద్‌మణి, సంగీతం, ఎడిటింగ్: విజయ్ ఆంటోని, ఛాయాగ్రహణం: కె.దిల్‌రాజ్, లైన్ ప్రొడ్యూసర్: శాండ్రా జాన్సన్.

1202

More News

VIRAL NEWS