శకుంతలదేవి పాత్రలో


Wed,May 8, 2019 11:38 PM

vidya balan play human computer shakuntala devi

ఎన్టీఆర్ బయోపిక్‌లో బసవతారకం పాత్రలో చక్కటి అభినయాన్ని కనబరిచింది బాలీవుడ్ నటి విద్యాబాలన్. ఈ సినిమా తర్వాత తాజాగా ఆమె మరో జీవితకథకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. హ్యూమన్ కంప్యూటర్‌గా పేరుగాంచిన భారత గణిత శాస్త్రవేత్త శకుంతల దేవి పాత్రలో ఆమె నటించనున్నది. కంప్యూటర్ కంటే వేగంగా గణిత సమస్యలను పరిష్కరించి గిన్నీస్‌బుక్‌లో స్థానం సంపాదించుకున్నారు శకుంతలదేవి. గణితం, ఖగోళ శాస్త్రంతో పాటు స్వలింగసంపర్కులపై పలు పుస్తకాల్ని రచించారు. ఆమె జీవితాన్ని దర్శకురాలు అనుమీనన్ వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ఈ సినిమాలో శకుంతల దేవి పాత్రను విద్యాబాలన్ పోషించనున్నది. దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన గొప్ప మహిళా పాత్రలో నటించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని విద్యాబాలన్ తెలిపింది. మారుమూల ప్రాంతంలో జన్మించి ప్రపంచానికి తన ప్రతిభను చాటిన గొప్ప మహిళా శకుంతల దేవి. గణిత శాస్త్రంలో ప్రజ్ఞను చాటడంతో పాటు మహిళాహక్కుల పట్ల ధైర్యంగా తన గళాన్ని వినిపించిన ఆమె జీవితంలో భిన్న పార్శాలను ఈ సినిమాలో చూపించనున్నాం అని విద్యాబాలన్ అన్నారు. విక్రమ్ మల్హోత్రా నిర్మించనున్న ఈ చిత్రం 2020 వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది.

970

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles