వెంకటేష్ మెచ్చిన 4 లెటర్స్!


Tue,February 5, 2019 11:43 PM

victory venkatesh congratulated 4 letters movie team

ఈశ్వర్, టువ చక్రవర్తి, అంకిత మహారాణా నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం 4 లెటర్స్. ఆర్.రఘురాజ్ దర్శకుడు. దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్ నిర్మిస్తున్నారు. సెన్సార్ పూర్తయింది. ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్‌ని ప్రత్యేకంగా వీక్షించిన హీరో వెంకటేష్ చిత్ర బృందాన్ని అభినందించారు. సరికొత్త నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. నిర్మాతలు మాట్లాడుతూ వైజాగ్ సత్యానంద్ వద్ద శిక్షణ పొందిన ఈశ్వర్‌ను ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేస్తున్నాం. కమర్షియల్ హంగులతో ఆద్యంతం వినోదాత్మకంగా రూపొందిన ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకముంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ కలుసుకోవాలని సినిమా తరువాత తెలుగులో నేను రూపొందించిన నవతరం ప్రేమకథాచిత్రమిది. అందుకే కుర్రాళ్లకు అర్థమవుతుందిలే అనే శీర్షికను పెట్టాం. ప్రేమ, పెళ్లి విషయాల్లో నేటి తరం యువత ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా వుంటున్నాయి? అనే అంశాల్ని తీసుకుని వాస్తవికతకు దగ్గరగా తీసిన చిత్రమిది. కథ, కథనాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూనే ఆలోచించే విధంగా సాగుతాయి. హీరోగా పరిచయమవుతున్న ఈశ్వర్‌కు ఈ సినిమాతో మంచి గుర్తింపు లభిస్తుంది అన్నారు.

1308

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles