ప్రబోధాత్మక చిత్రం ‘మహర్షి’

Thu,May 16, 2019 12:07 AM

‘వ్యవసాయాన్ని పరిరక్షిస్తూ అన్నదాతలకు అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను చాటిచెప్పిన ప్రబోధాత్మక చిత్రం ‘మహర్షి” అని అన్నారు ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు. కుటుంబంతో కలిసి ఆయన ‘మహర్షి’ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌ వేదికగా వెంకయ్యనాయుడు సినిమాపై ప్రశంసలు కురిపించారు. ‘గ్రామీణ ఇతివృత్తంతో మంచి సందేశంతో రూపొందిన చిత్రమిది. గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తుకుతెచ్చిన సినిమా. మహేష్‌బాబు సహజమైన నటనను కనబరిచాడు’ అని అన్నారాయన. వెంకయ్యనాయుడు వ్యాఖ్యలపై మహేష్‌బాబు ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ ‘వెంకయ్యనాయుడుగారి ప్రశంసల్ని నాతో పాటు మా చిత్ర యూనిట్‌కు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఇంతకు మించిన అభినందన మరొకటి ఉండదనుకుంటున్నాను. ‘మహర్షి’ వంటి మరెన్నో మంచి సినిమాలు చేయడానికి ఆయన మాటలు స్ఫూర్తినిచ్చాయి’ అని అన్నారు. వెంకయ్యనాయుడు ప్రశంసలు తమకెప్పటికి గుర్తుండిపోతాయని, ఇది తమపై ఉన్న బాధ్యతను మరింత పెంచిందని దర్శకుడు వంశీపైడిపల్లి పేర్కొన్నారు.

1089

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles