ఊహించని ఆఫర్!


Sat,November 17, 2018 10:39 PM

Vennela Kishore in director Shankar film

బ్రహ్మానందం తరువాత తెలుగులో అంత పాపులర్ అయిన హాస్య నటుడు వెన్నెల కిషోర్. వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్న ఆయనకు ప్రముఖ క్రేజీ దర్శకుడు శంకర్ నుంచి ఊహించని ఆఫర్ దక్కినట్లు సమాచారం. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా 2.0 చిత్రాన్ని రూపొందిస్తున్న శంకర్ ఈ సినిమా తరువాత కమల్‌హాసన్‌తో భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన సెట్ వర్క్ మొదలైంది. వచ్చే ఏడాది ప్రధమార్థంలో లాంఛనంగా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు తాజా సమాచారం.

3446

More News

VIRAL NEWS