వెంకీ మామతో కల నెరవేరింది

Thu,December 5, 2019 12:13 AM

‘‘దేవుడా.. ఓ మంచి దేవుడా.. చాలా థ్యాంక్ దేవుడా.. ఫైనల్‌గా డిసెంబర్ 13న సినిమా వస్తోంది. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను.. దేవుడా.. ఎప్పుడూ ఇంత టెన్షన్ పడలేదు.. దేవుడా. అన్నారు.. మిలట్రీ నాయిడు అన్నారు..రిలీజ్ డేట్ మాత్రం ఇన్నాళ్లు చెప్పలేదు..థ్యాంక్యూ సురేష్ ప్రొడక్షన్స్.. థ్యాంక్యూ అన్నయ్య’ అంటూ కథానాయకుడు వెంక తను నటించిన సూపర్‌హిట్ మూవీ ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రంలోని ఓ వినోద సన్నివేశాన్ని అనుకరిస్తూ బుధవారం జరిగిన ‘వెంకీమామ’ విడుదల తేదీ పాత్రికేయుల సమావేశంలో తనదైన శైలిలో వేదికపై నవ్వులు కురిపించాడు.. నాగచైతన్యతో కలిసి ఆయన నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘వెంకీమామ’. సురేష్‌బాబు, టీజీ విశ్వవూపసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కె.ఎస్.రవీంవూద(బాబీ) దర్శకుడు. రాశీఖన్నా, పాయల్‌రాజ్‌పుత్ కథానాయికలు. ఈ నెల 13న చిత్రం విడుదలకానుంది.


బుధవారం హైదరాబాద్‌లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా వెంక మాట్లాడుతూ ‘ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ముప్పై ఏళ్లు అవుతున్న వేదికలపై ఎక్కగానే టెన్షన్‌తో నాకు మాటలు రావు. అందరూ నేర్చుకుంటున్నారు. నాకు మాత్రం మాట్లాడటం రావడం లేదు. నాగచైతన్యలోని ఆల్‌రౌండర్‌ను ఈ సినిమాలో చూస్తారు. నా కల నిజమైన అనుభూతి కలిగింది. రానా, నాగచైతన్యతో కలిసి సినిమాలు చేయాలని ఎప్పుడూ కోరుకునేవాణ్ణి. నాన్న కూడా మాతో సినిమాలు చేయాలని అనుకునేవారు. ఆయన ఉండుంటే సినిమా చూసి ఆనందించేవారు’ అని అన్నారు నాగచైతన్య మాట్లాడుతూ ‘నా కెరీర్‌లో ‘మనం’ తర్వాత ‘వెంకీమామ’ మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఎన్ని సినిమాలు చేసినా ఈ చిత్రాల్ని మర్చిపోను. సురేష్ ప్రొడక్షన్ సంస్థలో సినిమా చేయాలనే కోరిక తీరింది’ అని చెప్పారు.

దర్శకుడు బాబీ మాట్లాడుతూ ‘‘జై లవకుశ’ తర్వాత కోన వెంకట్ ద్వారా ఈ మల్టీస్టారర్ సినిమా చేసే అవకాశం లభించింది. ఒకే కుటుంబానికి చెందిన మామాఅల్లుళ్ల కాంబినేషన్‌లో సినిమా చేస్తే నిజాయితీగా బాగుంటుందనిపించింది. సురేష్‌బాబు దగ్గరకు వెళ్లేముందు చాలా మంది భయపెట్టారు. కానీ కథ వినగానే ఆయన బాగుందన్నారు. తమ కుటుంబంలోని ఇద్దరూ హీరోలు కలిసి చేస్తున్న సినిమా బాగుండాలనే ఆయన ఆలోచనను అర్థం చేసుకుంటూ రూపొందించాను. ప్రతి ఇంట్లోని మామాఅల్లుళ్లను ఈ సినిమా గుర్తుకుతెస్తుంది’ అని పేర్కొన్నారు. ‘మానవ సంబంధాల నేపథ్యంలో ఏడాదిన్నర క్రితం రచయిత జనార్ధన మహర్షి చెప్పిన పాయింట్‌ను దర్శకుడు బాబీ అద్భుతంగా డెవలప్ చేశారు. వినోదం, త్యాగం అంశాలతో మామా అల్లుళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని హృద్యంగా ఆవిష్కరిస్తుంది. నవరసాలున్న పూర్తిస్థాయి తెలుగు సినిమా ఇది’ అని సురేష్‌బాబు పేర్కొన్నారు. నటనపరంగానే కాకుండా వ్యక్తిగతంగా తాను వెంక అభిమానిస్తానని, ఆయనతో పనిచేయడం ఆనందంగా ఉందని రాశీఖన్నా చెప్పింది. ఈ కార్యక్షికమంలో విశ్వవూపసాద్, వివేక్, విజయ్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.

298

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles