వెంకీ అట్లూరి దర్శకత్వంలో..?

Tue,January 22, 2019 11:45 PM

అర్జున్‌రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా వంటి వరుస విజయాలతో స్టార్ హీరోల సరసన నిలిచారు విజయ్ దేవరకొండ. క్రేజీ కథానాయకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం శ్రీధర్ తుమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నారు. మైత్రీమూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. కాకినాడ నేపథ్యంలో సాగే ఈ సినిమా చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. కాగా ఈ చిత్రం తరువాత మళ్లీ మైత్రీ మూవీమేకర్స్‌కే విజయ్ దేవరకొండ మరో చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించే అవకాశం వుందని తాజాగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి హీరో అనే సరికొత్త టైటిల్‌ని చిత్ర బృందం రిజిష్టర్ చేయించినట్లు తెలిసింది. తొలిప్రేమ చిత్రంతో దర్శకుడిగా తొలి విజయాన్ని సొంతం చేసుకున్న వెంకీ అట్లూరి ప్రస్తుతం అఖిల్ హీరోగా మిస్టర్ మజ్ను చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

2185

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles