సంక్రాంతికి సంపూర్ణ వినోదం

Mon,January 7, 2019 11:09 PM

మూడు పెద్ద సినిమాలకు థియేటర్లను ఎలా సర్దుబాటు చేయాలో తెలియక నిర్మాతలు, పంపిణీదారులు సతమతమవుతున్నారు. ఇలాంటి తరుణంలో తమిళ అనువాద సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ఒక నిర్మాత నిర్ణయించారు. తెలుగు సినిమాలకు కాకుండా ఇతర భాషల చిత్రాలకు థియేటర్లు కేటాయించే పరిస్థితి ప్రస్తుతం లేదు.ఇవి ఆలోచించకుండా నోరు జారి పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. అలాంటి మాటలు మేము మాట్లాడగలం. కానీ నాకో వ్యక్తిత్వం ఉంది. పంపిణీదారుడిగా ఏడాది కాలంలో చాలా డబ్బులు కోల్పోయాను. అయినా సినిమాల పట్ల ఉన్న ఇష్టం, ప్రేమతో నిర్మాత, పంపిణీదారుడిగా కొనసాగుతున్నాను.

ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు, మళ్లీశ్వరి, నువ్వునాకు నచ్చావ్ తర్వాత పూర్తిస్థాయి కామెడీ కథాంశంతో నేను చేసిన సినిమా ఇది. సంక్రాంతికి సంపూర్ణమైన కుటుంబ కథా చిత్రంగా నిలుస్తుంది అని అన్నారు వెంకటేష్. వరుణ్‌తేజ్‌తో కలిసి ఆయన నటించిన మల్టీస్టారర్ చిత్రం ఎఫ్-2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఉపశీర్షిక. దిల్‌రాజు సమర్పణలో శిరీష్, లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకుడు. తమన్నా, మెహరీన్ కథానాయికలు. ఈ నెల 12న ఈ చిత్రం విడుదలకానుంది. ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్‌లో చిత్రబృందం విడుదలచేసింది. ఈ సందర్భంగా వరుణ్‌తేజ్ మాట్లాడుతూ నా కెరీర్‌లో మొత్తం చేయాల్సిన కామెడీని ఈ ఒక్క సినిమాలోనే చేయించారు దర్శకుడు అనిల్ రావిపూడి. వెంకటేష్ కామెడీని పండించడంలో దిట్ట. ఆయన శైలికి సరితూగేలా వినోదాన్ని పలికించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. వెంకటేష్ ఇచ్చిన ప్రోత్సాహం వల్ల ఈ చిత్రంలో కామెడీ అద్భుతంగా చేయగలిగాను అని పేర్కొన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ అనిల్ రావిపూడితో మా బ్యానర్‌లో మూడో సినిమా ఇది. ఇగో, విభేదాలు లేకుండా మా ప్రయాణం మొత్తం సరదాగా సాగిపోతుంది. సినిమాలో ప్రతి పాత్ర వినోదభరితంగా ఉంటుంది. సంక్రాంతికి ప్రేక్షకుల్ని నవ్విస్తూనే పెద్ద విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం ఉంది అని తెలిపారు. రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల పాటు కుటుంబమంతా హాయిగా నవ్వుకునే సినిమా ఇదని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. ఈ కార్యక్రమంలో తమన్నా, మెహరీన్, శిరీష్, హర్షిత్, సమీర్, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

- దిల్‌రాజు

1922

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles