రాశీఖన్నా ప్రేమపాఠాలు


Sun,August 25, 2019 12:43 AM

venkatesh rashi khanna on venky mama

ఈ మధ్యకాలంలో రేసులో కాస్త వెనకబడింది పంజాబీ అమ్మడు రాశీఖన్నా. తొలిప్రేమ తర్వాత ఈ సొగసరికి టాలీవుడ్‌లో మంచి విజయం దక్కలేదు. ప్రస్తుతం ఆమె వెంకీమామ చిత్రంలో నాగచైతన్య సరసన కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రాశీఖన్నా స్కూల్‌టీచర్ పాత్రలో కనిపించనుందట. ఆమెకు, నాగచైతన్యకు మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వుల్ని పంచుతాయని చెబుతున్నారు. ఈ అమ్మడు ఇప్పటివరకు చేసిన పాత్రలకు పూర్తిగా భిన్నంగా ఉంటుందని..అందం, అభినయం కలబోతగా ఆకట్టుకుంటుందని సమాచారం. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నది. నిజజీవితంలో మామాఅల్లుైళ్లెన వెంకటేష్, నాగచైతన్య తెరపై కూడా అవే పాత్రల్లో కనిపించబోవడం విశేషం. ఇదిలావుండగా రాశీఖన్నా..రవితేజ సరసన మహాసముద్రం చిత్రంలో కథానాయికగా ఎంపికైనట్లు తెలిసింది. ఈ చిత్రానికి అజయ్‌భూపతి (ఆర్.ఎక్స్.100 ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నారు.

511

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles