వెంకీ పుట్టినరోజున..

Mon,December 2, 2019 11:02 PM

వెంక నాగచైతన్య కథానాయకులుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘వెంకీమామ’. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి.సురేష్‌బాబు, టీజీ విశ్వవూపసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకుడు. రాశీఖన్నా, పాయల్‌రాజ్‌పుత్ కథానాయికలు. వెంక పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 13న ఈ చిత్రం విడుదలకానుంది. హీరో రానా, దర్శకుడు బాబీలపై చిత్రీకరించిన ఓ ఫన్నీ వీడియో ద్వారా విడుదల తేదీని చిత్రబృందం వెల్లడించింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘కుటుంబ విలువలు, వినోదం, ప్రేమ, భావోద్వేగాల సమ్మిళితంగా సాగే చిత్రమిది. లక్షసాధనలో ఓ మామాఅల్లుళ్లకు ఎదురైన పరిణామాలేమిటన్నది ఆకట్టుకుంటుంది. వెంక నాగచైతన్య పాత్రలు నవ్యరీతిలో ఉంటాయి. వారి కలయికలో వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి. ఇటీవల విడుదలైన పోస్టర్స్, పాటలకు చక్కటి స్పందన లభిస్తున్నది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల.

264

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles