వెంకీ మామ మొదలైంది


Wed,July 11, 2018 11:37 PM

Venkatesh Naga Chaitanya multi starrer launched

వెంకటేష్, నాగచైతన్య కథానాయకులుగా నటిస్తున్న వెంకీమామ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. కె.యస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై డి.సురేష్‌బాబు, టి.జి.విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయిక. పూజాకార్యక్రమాల అనంతరం చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్‌నివ్వగా, నిర్మాత డి.సురేష్‌బాబు కెమెరా స్విఛాన్‌చేశారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో వెంకటేష్, నాగచైతన్య మామాఅల్లుళ్లుగా కనిపించనున్నారు. ఆద్యంతం హాస్యప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. నాగచైతన్య కథానాయకుడిగా నటించిన ప్రేమమ్ చిత్రంలో వెంకటేష్ అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ మామఅల్లుళ్ల జోడీ మరో మారు వెండితెరపై సందడి చేయబోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ల, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, ప్రొడక్షన్ డిజైనర్స్: రామకృష్ణ, మౌనిక.

1486

More News

VIRAL NEWS

Featured Articles