నేనూ జీనీలాంటి వాణ్ణే!


Sat,May 11, 2019 11:39 PM

Venkatesh and Varuntej about Aladdin Movie released worldwide on 24th of this month

నాకు హాస్యం అంటే చాలా ఇష్టం. కామెడీ సినిమాల్ని ఎంతగానో ఆస్వాదిస్తాను. అలాద్దీన్ చిత్రంలో జీనీ పాత్రకు గళాన్ని అందించడం గొప్ప అనుభూతినిచ్చింది అన్నారు సీనియర్ కథానాయకుడు వెంకటేష్. అమెరికా అగ్ర నిర్మాణ సంస్థ వాల్ట్‌డిస్నీ నిర్మిస్తున్న రొమాంటిక్ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం అలాద్దీన్ ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాలో జీనీ పాత్రను హాలీవుడ్ అగ్రనటుడు విల్‌స్మిత్ పోషించారు. అలాద్దీన్‌గా మేనా మసూద్ నటించారు. తెలుగు వెర్షన్‌లో జీనీ పాత్రకు వెంకటేష్, అలాద్దీన్ పాత్రకు వరుణ్‌తేజ్ డబ్బింగ్ చెప్పారు.

ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. వెంకటేష్ మాట్లాడుతూ జీనీ పాత్రకు డబ్బింగ్ చెప్పడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. ఈ తరహా కామెడీ సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు చూసి ఆనందించాలనే ఉద్ధేశ్యంతో వాయిస్ ఓవర్ అందించాను. నా నిజజీవితంలో కూడా మంచి ఫన్ ఉంటుంది. అందుకే జీనీ పాత్రకు బాగా కనెక్ట్ అయ్యాను.

ఒక్కోసారి నేనూ జీనీలాంటి వాణ్ణే అనిపిస్తుంది. ఎఫ్-2 చిత్రంలో వరుణ్‌తేజ్‌ను గైడ్ చేస్తూ మంచి సలహాలతో ఆదుకుంటాను. ఇందులో కూడా జీనీ పాత్ర అలాద్దీన్‌కు అదే రీతిలో సహాయం చేస్తుంది. యూనివర్సల్ ఫీల్ ఉన్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఇష్టపడతారు అన్నారు. నాకు చిన్నప్పటి నుంచి బాలల కథలంటే చాలా ఇష్టం. నేనూ, చెల్లెలు కలిసి అలాంటి సినిమాలు ఎన్నో చూసేవాళ్లం. నిజజీవితంలో జీనీ ప్రత్యక్షమై ఏదైనా కోరుకోమంటే..ఈ ప్రపంచమంతా సంతోషంగా మారిపోవాలని కోరుకుంటా. అలాద్దీన్ పాత్రకు డబ్బింగ్ చెప్పడం ఓ సవాలుగా తీసుకున్నాను. పాత్ర హావభావాలకు అనుగుణంగా వాయిస్‌ఓవర్ ఛాలెంజ్‌గా అనిపించింది. వెంకటేష్‌గారితో కలిసి డబ్బింగ్ చెప్పడం ఆనందంగా ఉంది అన్నారు.

1839

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles