సందేశాత్మకంగా ‘వీడు అసాధ్యుడు’


Thu,August 9, 2018 11:28 PM

Veedu Asadhyudu movie launch

కృష్ణ సాయి, జహీదా శామ్ జంటగా నటిస్తున్న చిత్రం వీడు అసాధ్యుడు. పి.ఎస్.నారాయణ దర్శకుడు. ఎం.ఎస్.కె ప్రమిదశ్రీ ఫిలింస్ పతాకంపై సీతారామరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి శివాజీ రాజా క్లాప్ నివ్వగా, నటుడు శివకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ సరికొత్త కథతో ఆద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. తిరుపతిలో క్రిమినల్ లాయర్‌గా పనిచేస్తున్న ఎం.ఎస్.కె.రాజును హీరోగా పరిచయం చేస్తున్నాం అన్నారు.

1278

More News

VIRAL NEWS

Featured Articles