వీడే సరైనోడు


Tue,August 6, 2019 12:50 AM

veedi sarainodu movie release on the 23rd of this month

జీవా, నయనతార జంటగా ఆర్‌ఎస్ రామనాథం దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ఓ చిత్రాన్ని తెలుగులో వీడే సరైనోడు పేరుతో అనువదిస్తున్నారు. నోవా సినిమాస్ పతాకంపై కోకా శిరీష సమర్పణలో జక్కుల నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఈ నెల 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ గ్రామీణ, నగర నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ చిత్రంలో జీవా నటన, నయనతార గ్లామర్ ప్రధాన ఆకర్షణగా వుంటుంది. త్వరలోనే ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. కరుణాస్, జోమల్లూరి, మీనాక్షి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీకాంత్ దేవా, సాహిత్యం: వెన్నెలకంటి, చంద్రబోస్.

231

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles