ఫన్నీదొంగ వినోదం!

Sun,March 10, 2019 02:15 AM

సప్తగిరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం వజ్రకవచధర గోవింద.అరుణ్ పవార్ దర్శకుడు. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెండల, జీవీఎస్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఏప్రిల్ 6న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ మరో విభిన్నమైన పాత్రలో సప్తగిరి నటిస్తున్న చిత్రమిది. ఆయన నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తున్నారో ఆ అంశాలన్నీ ఈ చిత్రంలో వున్నాయి. ఫన్నీ దొంగ వజ్రకవచధరుడు ఎలా అయ్యాడు? అతను చేసే హంగామా ఏంటి అన్నదే ఇందులో ఆసక్తికరం. టైటిల్‌కు మంచి స్పందన లభిస్తోంది. కథ, కథనం కొత్త పంథాలో సాగే ఈ చిత్రాన్ని నిర్మాతలు ఏ విషయంలోనూ రాజీపడకుండా నిర్మిస్తున్నారు అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ హైదరాబాద్, మైసూర్, కూర్గ్ తదితర పరిసర ప్రాంతాల్లోని అందమైన ప్రదేశాల్లో చిత్రాన్ని తెరకెక్కించాం. సినిమా అనుకున్నదానికన్నా అద్భుతంగా వచ్చింది. విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తాం అన్నారు. వైభవీ జోషి, అర్చనా వేద, టెంపర్ వంశీ, అప్పారావు, అవినాష్, రాజేంద్ర జాన్ కొట్టోలి, వీరేన్ తంబిదొరై తదితరులు నటిస్తున్నారు.

2599

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles