అల్లూరి గెటప్‌లో..

Sat,March 23, 2019 11:34 PM

రామ్‌చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న తొలి మల్టీస్టారర్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. అలియాభట్, డైసీ ఆడ్గార్జియోన్స్ కథానాయికలుగా నటిస్తున్నారు. అజయ్‌దేవ్‌గణ్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత డీవీవీ దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీంగా కనిపించనున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన తొలి ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న రామ్‌చరణ్, ఎన్టీఆర్ తమ గెటప్‌లు బయటపడకుండా క్యాప్‌లు పెట్టుకుని జాగ్రత్తపడ్డారు.

దీంతో సినిమాలో వారి గెటప్‌లు ఎలా వుండబోతున్నాయనే విషయంలో సర్వత్రా ఆసక్తినెలకొంది. అయితే శనివారం ట్విట్టర్‌లో రామ్‌చరణ్‌తో కలిసి వున్న ఓ ఫొటోను హీరో వరుణ్‌తేజ్ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. గత కొన్ని రోజులుగా అల్లూరి గెటప్ కోసం సిద్ధమవుతున్న రామ్‌చరణ్ ఈ ఫొటోలో మీసం మెలేసి సరికొత్త ైస్టెల్ క్రాఫ్‌తో కనిపిస్తున్నారు. దీంతో రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌లో అల్లూరి గెటప్‌లో కనిపించనున్న రామ్‌చరణ్ లుక్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఈ నెలాఖరు నుంచి చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ సినిమాను 2020 జూలై 30న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషలతో పాటు మొత్తం పది భారతీయ భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

2492

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles