వరుణ్‌తేజ్ కొత్త లుక్!


Tue,May 15, 2018 11:06 PM

Varuntej
విభిన్న కథా చిత్రాలతో వరుస విజయాల్ని సొంతం చేసుకుంటున్నారు యువ హీరో వరుణ్‌తేజ్. ఇటీవల తొలిప్రేమ చిత్రంతో విజయాన్ని సొంతం చేసుకున్న ఆయన తాజాగా ఘాజీ ఫేమ్ సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో సరికొత్త చిత్రానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. స్పేస్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతున్నది. లావణ్య త్రిపాఠి, అదితిరావు హైదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో వ్యోమగామిగా నటిస్తున్న వరుణ్ ఆ లుక్ కోసం భారీ కసరత్తులు చేసి మిగతా చిత్రాలకు భిన్నంగా మీసంకట్టుతో సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. కొత్తలుక్‌లో సిద్ధమైన వరుణ్‌తేజ్ ఫొటో ఒకటి ప్రస్తుతం షోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దర్శకుడు సంకల్ప్‌రెడ్డి తీసిన తొలి చిత్రం ఘాజీకి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో తాజా చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి వ్యోమగామి అనే టైటిల్‌ను చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

1494

More News

VIRAL NEWS