శిక్షణ మొదలైంది!

Thu,February 7, 2019 12:35 AM

ఇటీవలే విడుదలైన ఎఫ్-2తో వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయారు వరుణ్‌తేజ్. ఈ విజయోత్సాహంతో తన తదుపరి సినిమా కోసం సన్నాహాలు మొదలుపెట్టారు. కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడితో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వరుణ్‌తేజ్ ఓ సినిమా చేయనున్నారు. గీతా ఆర్ట్స్ సంస్థ చిత్రాన్ని నిర్మించనున్నది. ఈ సినిమాలో వరుణ్‌తేజ్ బాక్సర్‌గా కనిపించబోతున్నారు. ఈ పాత్ర కోసం ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఎంజిలిస్‌లో బాక్సింగ్‌లో పత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు వరుణ్‌తేజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. చేతులకు బాక్సింగ్ గ్లోవ్స్ ధరించి పంచ్ విసురుతున్న ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్న ఆయన బాక్సింగ్‌లో శిక్షణ మొదలైంది అని పేర్కొన్నారు. ఈ సినిమాలో వరుణ్‌తేజ్ కోచ్‌గా సీనియర్ నటుడు అర్జున్ ముఖ్య పాత్రను పోషిస్తున్నట్లు తెలిసింది.

887

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles