ముగ్గురి యువకుల వినోదం

Fri,November 22, 2019 11:56 PM

శ్రీనివాసరెడ్డి, సత్య, షకలక శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు. ఈ చిత్రం ద్వారా హాస్యనటుడు వై.శ్రీనివాస్‌రెడ్డి దర్శకనిర్మాతగా మారుతున్నారు. డిసెంబర్ 6న విడుదలకానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను యువహీరో వరుణ్‌తేజ్ విడుదల చేశారు. దర్శకనిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ అనుకోకుండా నేరంలో చిక్కుకున్న ముగ్గురు యువకులు దాని నుంచి ఎలా బయటపడ్డారన్నదే చిత్ర ఇతివృత్తం. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సినిమాను విడుదల చేస్తున్నారు అన్నారు. ఈ చిత్ర బృందానికి అగ్రదర్శకుడు రాజమౌళి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలందజేశారు. నాకు తెలిసిన మంచి హాస్యనటుల్లో శ్రీనివాస్‌రెడ్డి ఒకరు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా ప్రేక్షకులముందుకు రాబోతున్న అతనికి నా శుభాకాంక్షలు అంటూ రాజమౌళి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రాజమౌళి మాటలు తమకు శక్తిని, ధైర్యాన్నిచ్చాయని శ్రీనివాస్‌రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

174

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles