వర్మ రద్దయింది!

Fri,February 8, 2019 11:53 PM

సినిమా పూర్తయి ఫస్ట్‌కాపీ కూడా సిద్ధమైంది. విడుదల తేదీని అధికారికంగా ప్రకటించడమే ఇక తరువాయి.. ఇంతలోనే అనూహ్యంగా సినిమాను రద్దు చేస్తూ నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలకాలంలో భారతీయ సినిమాలో ఈ తరహా ఉదంతం చోటుచేసుకున్న దాఖలాలు లేవు. అది వర్మ సినిమా విషయంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..అర్జున్‌రెడ్డిఆధారంగా తమిళంలో రూపొందుతున్న వర్మ ఫస్ట్‌కాపీ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసిన నిర్మాతలు సినిమా విడుదలను ఆపివేస్తున్నట్లు ప్రకటించారు. హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ కథానాయకుడిగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బాలా దర్శకుడు. సృజనాత్మక విభేదాలతో పాటు ఇతర కారణాల వల్ల ఫస్ట్‌కాపీ పట్ల సంతోషంగా లేమని ప్రకటించిన నిర్మాణ సంస్థ ఈ సినిమాను విడుదల చేయడం లేదని ప్రతికా ప్రకటనలో పేర్కొన్నది. మాతృకలోని ఆత్మను పరిపూర్ణ స్థాయిలో ఆవిష్కరిస్తూ ఈ సినిమాను ధృవ్ హీరోగా మళ్లీ కొత్తగా చిత్రీకరించబోతున్నాం. దర్శకుడితో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం. కొత్త టీమ్‌తో నిరంతరం శ్రమించి ఈ ఏడాది జూన్‌లో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నాం అని తెలిపారు.

1639

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles