స్కూల్‌డేస్ గుర్తొచ్చాయి..


Tue,April 9, 2019 12:02 AM

vamsi paidipally reveales boy movie first look

బోయ్ సినిమా టైటిల్ నాకు బాగా నచ్చింది. ప్రతి ఒక్కరికి చిన్నప్పుడు ఆ దశలో ఎన్నో మధుర జ్ఞాపకాలు వుంటాయి. ఈ చిత్ర పోస్టర్‌ను చూస్తుంటే నాకు స్కూల్‌డేస్ గుర్తుకొచ్చాయి అన్నారు వంశీ పైడిపల్లి. అమర్ విశ్వరాజ్ స్వీయ దర్శకత్వంలో ఆర్.రవిశేఖర్‌రాజుతో కలిసి నిర్మిస్తున్న బోయ్ చిత్రం ఫస్ట్‌లుక్‌ను మహర్షి చిత్ర సెట్‌లో మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్టర్ చూస్తుంటే ఈ చిత్ర కాన్సెప్ట్ కూడా కొత్తగా వుంటుందని అనుకుంటున్నాను. విడుదల తర్వాత వీలుచూసుకుని ఈ సినిమా తప్పకుండా చూడాలని వుంది అని తెలిపారు. లక్ష్య, వినయ్ వర్మ, సాహితి, నీరజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: అష్కర్, ఎడిటింగ్: ఎకలవ్యన్, సంగీతం: ఎల్విన్ జేమ్స్, సహ నిర్మాతలు: శశిధర్ కొండూరు, ప్రదీప్ మునగపాటి, రచన-దర్శకత్వం: అమర్ విశ్వరాజ్.

457

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles