వంశీ పైడిపల్లి దర్శకత్వంలో?


Sat,April 13, 2019 01:07 AM

vamshi paidipally to direct ram charan for second time

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో నటిస్తున్నారు రామ్‌చరణ్. ఇందులో ఆయన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించనున్నారు. ఈ సంవత్సరాంతంలో చిత్రీకరణ పూర్తికానుంది. వచ్చే ఏడాది జూలైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలావుండగా ఈ సినిమా అనంతరం వంశీపైడిపల్లి దర్శకత్వంలో రామ్‌చరణ్ ఓ చిత్రాన్ని చేయబోతున్నారని తెలిసింది. వంశీ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాకు రామ్‌చరణ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని సమాచారం. రామ్‌చరణ్-వంశీపైడిపల్లి కాంబినేషన్‌లో గతంలో ఎవడు వంటి విజయవంతమైన చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. మరోవైపు వంశీపైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న మహర్షి మే 9న ప్రేక్షకులముందుకురానుంది.

1452

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles