త్రివిక్రమ్‌ దగ్గర నేర్చుకున్నా!


Mon,June 10, 2019 11:43 PM

Vajra Kavachadhara Govinda Movie Director Arun Pawar Interview

‘ఆశయం గొప్పది అయినప్పుడు మనం ప్రయాణించే దారి కూడా ఉన్నతమైనదిగా ఉండాలి. అప్పుడే విజయాల్ని అందుకోలగమనే అంశానికి వినోదాన్ని జోడించి ఈ సినిమాను రూపొందించాం’ అని అన్నారు అరుణ్‌పవార్‌. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వజ్ర కవచవధర గోవింద’. సప్తగిరి కథానాయకుడు. నరేంద్ర యెడల, జీవీఎన్‌రెడ్డి నిర్మాతలు. ఈ నెల 14న విడుదలకానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో దర్శకుడు అరుణ్‌పవార్‌ పాత్రికేయులతో ముచ్చటించారు.

గోవింద అనే దొంగ కథ ఇది. అతడు దొంగగా మారటానికి దారితీసిన పరిస్థితులేమిటి? ఓ వజ్రం అతడికి కవచంగా ఎలా ఉపయోగపడిందన్నది ఆకట్టుకుంటుంది. వినోదంతో పాటు అంతర్లీనంగా చక్కటి భావోద్వేగాలు, సందేశం సమ్మిళితమై ఉంటుంది. సప్తగిరిలోని హాస్యనటుడిని కొత్త పంథాలో ఆవిష్కరిస్తుంది. నా తొలి సినిమా మాదిరిగా అనవసరమైన వాణిజ్య హంగులు, డ్యాన్సులపై దృష్టిపెట్టకుండా కేవలం వినోదానికి ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కించాం. ప్రతి సన్నివేశం, పాట కథానుగుణంగానే సాగుతూ నవ్విస్తుంది.

త్రివిక్రమ్‌ నా గురువు

విజువల్‌ ఎఫెక్ట్స్‌ కళాకారుడిగా నా సినీ ప్రయాణం ప్రారంభమైంది. పదేళ్లలో వంద సినిమాలకుపైగా విజువల్‌ ఎఫెక్ట్స్‌ అందించాను. త్రివిక్రమ్‌తో చేసిన ‘అత్తారింటికి దారేది’ నాకు మంచి పేరును తెచ్చిపెట్టింది. విజువల్‌ ఎఫెక్ట్స్‌ అందిస్తున్న సమయంలో దర్శకుల తీరుతెన్నులను, వారి పనితీరును పరిశీలించేవాణ్ణి. అలా సంపాదించుకున్న అనుభవంతో దర్శకుడిగా మారాను. త్రివిక్రమ్‌ను నా గురువుగా భావిస్తాను. కథ, మాటలు ఎలా రాయాలో ఆయన వద్దే నేర్చుకున్నాను. సినిమాల్ని తెరకెక్కించడంలో ఆయన ఆలోచన శైలి నా దృక్పథాన్ని మార్చివేసింది. దర్శకుడు కె.ఎస్‌ రవీంద్ర (బాబీ) నిర్మాతగా మారి తెరకెక్కించనున్న సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాను. ‘వెంకీమామ’ స్క్రిప్ట్‌వర్క్‌లో ఆయనతో కలిసి ప్రయాణం చేశాం. ఆ సమయంలోనే ఈ కథ వినిపించాను. హీరో ఎవరనేది ఇంకా నిర్ణయించుకోలేదు.

1518

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles