అలా అనకుంటే పేరు మార్చుకుంటా!


Thu,June 13, 2019 12:58 AM

Vajra Kavachadhara Govinda is an upcoming Telugu movie scheduled to be released on 14 Jun 2019

సప్తగిరి సినిమా అంటే ప్రేక్షకులు వినోదాన్ని ఆశిస్తారు. అయితే ఇందులో ప్రేక్షకులు ఆశించే వినోదంతో పాటు కట్టిపడేసే భావోద్వేగ సన్నివేశాలు. ఆకట్టుకునే పోరాట ఘట్టాలు, ైక్లెమాక్స్ వున్నాయి. సినిమా చూసిన ప్రేక్షకుడు అదిరింది అని అనకుంటే నా పేరు మార్చుకుంటాను అన్నారు అరుణ్ పవార్. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం వజ్రకవచధర గోవింద. సప్తగిరి హీరోగా నటించారు. నరేంద్ర యెండల, జీవీఎన్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సప్తగిరి మాట్లాడుతూ సినిమా విషయంలో నూటికి నూరు శాతం నమ్మకంతో వున్నాం. టీమ్ అంతా చాలా ఇష్టపడి కష్టపడి చేసిన సినిమా ఇది. అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ఫైనల్ కాపీ చూసుకున్నాక ఇంత మంచి చిత్రాన్ని నిర్మించినందుకు గర్వంగా అనిపించింది. సప్తగిరి, అరుణ్ పవార్ ఇచ్చిన నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించాను అన్నారు.

907

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles