కోల్‌కతాలో ఉప్పెన

Tue,October 22, 2019 12:02 AM

వైష్ణవ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఉప్పెన. బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తమిళ అగ్రహీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. క్రితిశెట్టి కథానాయిక. మైత్రీమూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సోమవారం నుంచి ప్రారంభమైన కొత్త షెడ్యూల్‌ను కోల్‌కతా, గ్యాంగ్‌టాక్ ప్రాంతాల్లో చిత్రీకరించబోతున్నారు. 20 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్‌లో చిత్ర ప్రధాన తారాగణంపై ముఖ్యఘట్టాలను తెరకెక్కించబోతున్నారు. వినూత్నమైన ప్రేమకథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, ఎమోషనల్ రొమాంటిక్ మూవీగా అలరిస్తుందని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శాందత్ సైనుద్దీన్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటింగ్: నవీన్‌నూలి, ఆర్ట్: మోనికా రామకృష్ణ, సీఈఓ: చెర్రీ, రచన-దర్శకత్వం: బుచ్చిబాబు సానా.

258

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles