వైష్ణవ్‌తేజ్ ఉప్పెన!

Wed,May 8, 2019 12:27 AM

హీరో సాయితేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు దర్శకుడు. మైత్రీ మూవీమేకర్స్ సంస్థతో కలిసి దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే పూజాకార్యక్రమాలు నిర్వహించారు. కాగా పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఉప్పెన అనే టైటిల్‌ను చిత్ర బృందం ఖరారు చేసింది. కథకు ఎలాంటి టైటిల్ పెట్టాలా అని చాలా ఆలోచించాం. కథకు తగిన విధంగా ఉప్పెన టైటిల్ అయితే పక్కాగా సరిపోతుందని ఆ టైటిల్‌నే నిర్ణయించాం. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నాం అని చిత్ర బృందం తెలిపింది. తమిళ నటుడు విజయ్‌సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్‌దత్, సైనుద్దీన్ ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు.

1257

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles