వైకుంఠపాళి ఆటలో


Sun,July 21, 2019 11:59 PM

Vaikuntapali Movie released on July 23

సాయికేతన్, మేరీ జంటగా నటిస్తున్న చిత్రం వైకుంఠపాళి. అజ్గర్ అలీ దర్శకుడు. కాండ్రేగుల ఆదినారాయణ నిర్మిస్తున్నారు. ప్రమోద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర గీతాలు శనివారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఆడియో సీడీలను నిర్మాత కె.ఎస్.రామారావు ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ వినూత్నమైన పాయింట్‌తో తెరకెక్కిన హారర్ చిత్రమిది. జీవితమనే పరమపదసోపానపు ఆటలో ఓ పోలీస్ ఎలా గెలుపొందాడు? ప్రతీకారేచ్ఛతో ఉన్న ఓ ఆత్మతో అతడికి ఉన్న సంబంధమేమిటన్నది ఆకట్టుకుంటుంది అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ సాయికేతన్ అండర్‌కవర్ పోలీస్‌గా కనిపిస్తాడు. కథను నమ్మి ఈ సినిమాను రూపొందించాం. ఈ నెల 23న విడుదల చేస్తున్నాం. మా బ్యానర్‌లో మిస్టర్ లోన్లీ(వీడి చుట్టూ అమ్మాయిలే) పేరుతో మరో సినిమా చేయబోతున్నాం అని తెలిపారు. టీజర్, ట్రైలర్‌ను ఆసక్తిని పంచుతున్నాయని, కొత్తదనానికి పట్టం కడుతున్న ప్రస్తుత తరుణంలో ఈ చిత్రం ప్రతి ఒక్కరిని మెప్పిస్తుందనే నమ్మకం ఉందని కె.ఎస్.రామారావు చెప్పారు. ఈ కార్యక్రమంలో వీర శంకర్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయివెంకట్ తదితరులు పాల్గొన్నారు.

290

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles