ఏవీఎస్ తనయుడు దర్శకుడిగా..


Thu,January 3, 2019 12:00 AM

Vaidehi Movie Trailer Launch Event

మహేష్, ప్రవీణ్, వెంకటేష్, సందీప్, ప్రణతి, అఖిల, లావణ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం వైదేహి. దివంగత హాస్యనటుడు ఏవీఎస్ కుమారుడు రాఘవేంద్ర ప్రదీప్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యాక్టివ్ స్టూడియోస్ పతాకంపై ఎ.జనని ప్రదీప్ నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏవీఎస్ నాకు మంచి మిత్రుడు. అద్భుతమైన కమెడియన్‌గా, జర్నలిస్టుగా, కాలమిస్టుగా కెరీర్ ప్రారంభించి బాపు, రమణల ప్రోత్సాహంతో నటుడిగా మారారు. సినిమాని, సాహిత్యాన్ని అవపోసన పట్టారు. ఆయన లేని లోటు ఎప్పటికీ తీరదు. ఆయన జయంతి రోజున ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయడం ఆనందంగా వుంది. ట్రైలర్ బాగుంది. హారర్ జోనర్ సినిమాలు తప్పకుండా ఆకట్టుకుంటాయి. సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా నిరూపించుకునేందుకు ప్రదీప్ ఈ జోనర్‌ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ ముగింపు ఆసక్తికరంగా వుంది. స్టార్స్ లేని సినిమాకు కథ, కథనం ముఖ్యం. ఈ చిత్రంలో కావాల్సిన అంశాలన్నీ వున్నాయి. సినిమా పెద్ద హిట్ కావాలి అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ట్రైలర్ రిలీజ్ చేయడానికి మంచి సందర్భం కోసం ఎదురుచూశాను. నాన్న జయంతిన ట్రైలర్ విడుదల చేయడం ఆనందంగా వుంది. మన మైండ్‌లో వున్నదాన్ని తెరపైకి తీసుకురావాలంటే మంచి కెమెరామెన్ ముఖ్యం. దేవా చాలా ఫ్రీడమ్ తీసుకుని నేను ఊహించిన విధంగా తెరపైకి తీసుకొచ్చాడు. సినిమాకు సహకరించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు. శంకర్‌గారు మా కుటుంబానికి అత్యంత ఆప్తులు. ఆయన ట్రైలర్ విడుదల చేయడం మా నాన్నే వచ్చి రిలీజ్ చేసినట్టుంది అన్నారు.

1058

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles