తుపాకి సంస్కృతిపై పోరు

Mon,September 30, 2019 12:04 AM

కిక్ శ్యామ్ కథానాయకుడిగా తమిళ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్న చిత్రం వాడొస్తాడు. సారథి దర్శకుడు. కె.వి.శబరీష్ నిర్మాత. ఆత్మీయ, శ్రీదేవికుమార్ కథానాయికలు. అక్టోబర్‌లో విడుదల చేయబోతున్నారు. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ప్రపంచ దేశాలలో ఎక్కువ తుపాకులు కలిగివున్న దేశంగా అమెరికా మొదటిస్థానంలో ఉంది. అక్కడ జరిగే కాల్పుల్లో అధికంగా బలైపోతున్నది మన భారతీయులే. ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. అమెరికాలోని లాస్‌వేగాస్‌లో షూటింగ్ జరిపాం. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. కిక్ శ్యామ్ విభిన్న పాత్రలో కనిపిస్తాడు. హాలీవుడ్, తమిళ సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేశారు అన్నారు.

441

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles