ఉత్కంఠగా ఉత్తర


Sat,July 20, 2019 11:10 PM

uttara movie trailer launch

శ్రీరామ్, కారుణ్య కత్రేన్ జంటగా నటిస్తున్న చిత్రం ఉత్తర. తిరుపతి యస్.ఆర్ దర్శకుడు. ఈ చిత్ర ట్రైలర్‌ను శనివారం దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ రొమాంటిక్ క్రైమ్ కథాంశమిది. పాత్రలన్ని సహజంగా అనిపిస్తాయి. సినిమాలోని ప్రతి సన్నివేశంతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. సరికొత్త బ్యాక్‌డ్రాప్‌లో సాగుతూ ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది అన్నారు. ఈ కథ నాకు తెలుసు. ఈ సినిమా కోసం దర్శకుడు తిరుపతి ఎంతగానో కష్టపడ్డాడు. ట్రైలర్ చూస్తుంటే విజయంపై నమ్మకం మరింత పెరిగింది. సురేష్ బొబ్బిలి సంగీతం ఈ కథకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆర్టిస్టులందరూ చక్కటి అభినయాన్ని కనబరిచారు అని మామిడి హరికృష్ణ అన్నారు. ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే విశ్వాసం ఉందని నిర్మాతల్లో ఒకరైన గంగదాస్ చెప్పారు. వినూత్న కథా చిత్రంలో భాగమవడం ఆనందంగా ఉందని నాయకానాయికలు తెలిపారు.

168

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles