ప్రతి ఒక్కరు ప్రేమలో పడతారు!


Mon,June 10, 2019 12:09 AM

Upendra  movie I Love You will be release on June 14 2019

ఉపేంద్ర కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఐ లవ్ యు. నన్నే ప్రేమించు ఉపశీర్షిక. రచితారామ్ కథానాయిక. స్వీయనిర్మాణ దర్శకత్వంలో ఆర్.చంద్రు రూపొందిస్తున్నారు. ఈ నెల 14న ప్రేక్షకులముందుకురానుంది. శనివారం ఏపీలోని విశాఖపట్నంలో ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ అసలు ప్రేమ అంటే ఏమిటి? నిజమైన ప్రేమను ఎలా నిర్వచించాలి? అనే అంశాల్ని సందేశాత్మక కోణంలో చర్చించే చిత్రమిది. స్వార్థంలేని ప్రేమ గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ైక్లెమాక్స్ ఘట్టాలు భావోద్వేగభరితంగా సాగుతాయి. వాణిజ్య అంశాలతో పాటు యాక్షన్ హంగులు కూడా ఉంటాయి అన్నారు.

తెలుగులో నా రెండో చిత్రమిది. టీనేజ్‌లో ప్రేమమీద సరైన అవగాహన లేకుండా చాలామంది జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. అలాంటి వారికి సందేశాన్ని అందించే చిత్రమిది. ఈ కథతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు. ైక్లెమాక్స్‌లో చప్పట్లు కొడుతూ అభినందిస్తారు. ఉపేంద్ర పాత్ర చిత్రణలో భావోద్వేగాలతో పాటు వినోదం ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందించే చిత్రమవుతుంది. రెండేళ్లకోసారి ఉపేంద్రతో సినిమాలు చేయాలనుకుంటున్నాను అని దర్శకుడు తెలిపారు. సోనుగౌడ, బ్రహ్మానందం, హోనవళ్లి, కృష్ణ, జై జగదీష్, పీడీ సతీష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సుజ్జాన్, సంగీతం: డా॥ కిరణ్ తోటంబైల్, రచన, నిర్మాణం, దర్శకత్వం: ఆర్.చంద్రు.

1244

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles