పల్లెటూరి పోలీస్


Wed,January 2, 2019 11:54 PM

Unmadi Movie Release Trailer Relese

ఎన్.ఆర్.రెడ్డి కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ఉన్మాది. ఎన్.రామారావు నిర్మాత. శిరీష కథానాయిక. డేవిడ్ స్వరాలను సమకూర్చిన ఈ చిత్ర గీతాలు మంగళవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఆడియో సీడీలను నిర్మాత రాజ్ కందుకూరి ఆవిష్కరించారు. ట్రైలర్‌ను దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ విడుదలచేశారు. ఈ సందర్భంగా ఎన్.శంకర్ మాట్లాడుతూ హీరోయిజం, రౌడీయిజం రెండింటి మేళవింపుతో ఎన్.ఆర్.రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇలాంటి కథతో సినిమా చేయడానికి చాలా ధైర్యం కావాలి అని పేర్కొన్నారు. దర్శకుడు మాట్లాడుతూ గ్రామీణ నేపథ్య చిత్రమిది. రొటీన్‌కు భిన్నమైన కథ, కథనాలతో చక్కటి థ్రిల్‌ను కలిగిస్తుంది. పోలీస్ అధికారిగా నా పాత్ర శక్తివంతంగా ఉంటుంది. ఉన్మాదిని పట్టుకునే క్రమంలో ఓ పోలీస్‌కు ఎదురయ్యే పరిణామాలు ఆసక్తిని పంచుతాయి అని తెలిపారు. సినిమాలో తాను అభినయానికి ప్రాధాన్యమున్న మంచి పాత్రను పోషించానని శిరీష చెప్పింది. ఈ కార్యక్రమంలో డేవిడ్, కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు.

1569

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles