యథార్థ ప్రేమకథ!


Tue,April 9, 2019 12:01 AM

undiporaadhey movie release on june 2019

కేదార్ శంకర్, నూకరాజు, సిద్ధిక, రూపిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఉండిపోరాదే. నవీన్ నాయని దర్శకుడు. గోల్డ్‌టైమ్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి సత్యప్రమీల సమర్పణలో డా॥ లింగేశ్వర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ 15 ఏళ్ల క్రితం జరిగిన యథార్థ సంఘటలన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. మనసుని హత్తుకునే సన్నివేశాలు, ఊహించని మలుపులు భావోద్వేగభరింతంగా వుంటాయి. రాజమండ్రి. మైసూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన 20 శాతం హైదరాబాద్, అండమాన్ దీవుల్లో జరిపే చిత్రీకరణతో పూర్తవుతుంది. త్వరలో ఆడియోను, జూన్‌లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. రజాక్, సత్యకృష్ణన్, సుజాత, విఠల్, అజయ్ ఘోష్ తదితరలు నటిస్తున్నారు.

1067

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles