యదార్థ ప్రేమకథ!


Sat,June 15, 2019 11:25 PM

Undiporaadhey movie audio will be launched on June 23rd june

తరుణ్‌తేజ్‌, లావణ్య జంటగా నటిస్తున్న చిత్రం ‘ఉండిపోరాదే’. నవీన్‌ నాయిని దర్శకుడు. డా.లింగేశ్వర్‌ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక రియలిస్టిక్‌ లవ్‌స్టోరీ. పక్కింటి అమ్మాయి జీవితం చూసినట్టుగా సినిమా వుంటుంది. ముఖ్యంగా తండ్రీ కూతుళ్ల మధ్య సాగే భావోద్వేగాలు, మనసుని కదిలించే ఓ పాట ఆకట్టుకుంటుంది. ఇటీవలే కన్నడంలో ఈ చిత్ర ఆడియోను విడుదల చేశాం. కేదార్‌ శంకర్‌, అజయ్‌ ఘోష్‌ పాత్రలు చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘ఈ చిత్ర ఆడియో విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. సబు వర్గీస్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 23న ఆడియో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటి వరకు తెలుగు తెరపై రాని కథ ఇది. సుద్దాల అశోక్‌తేజ రాసిన నాన్న పాటకు తప్పకుండా అవార్డు వస్తుంది. ప్రతీ తల్లిదండ్రులు పిల్లలతో కలిసి చూడదగ్గ చిత్రమిది. ఎంతమంది వున్నా మనల్ని చివరి వరకు ప్రేమించేది తల్లిదండ్రులే అనే సందేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం’ అన్నారు.

854

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles