వినోదాల ఊల్లాల ఊల్లాల

Sun,October 13, 2019 12:14 AM

నటరాజ్‌, నూరిన్‌, అంకిత నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. సత్యప్రకాష్‌ దర్శకుడు. ఏ.గురురాజ్‌ నిర్మాత. ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను శనివారం హైదరాబాద్‌లో సీనియర్‌ హీరో వెంకటేష్‌ ఆవిష్కరించారు. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘నవ్యమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. మిస్‌ కేరళ నూరిన్‌, మిస్‌ బెంగళూరు అంకిత నాయికలుగా నటిస్తున్నారు. ఆద్యంతం హాస్యప్రధానంగా ఆకట్టుకునే చిత్రమిది. నవంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ‘మా అబ్బాయి నటరాజ్‌ ఈచిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమవుతున్నాడు. యువతరం చేసే హంగామాకు అందమైన దృశ్యరూపంలా అలరిస్తుంది’ అని దర్శకుడు సత్యప్రకాష్‌ తెలిపారు. ఈ సినిమా టీజర్‌ను చిరంజీవిగారు అభినందించారని ప్రతాని రామకష్ణగౌడ్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

300

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles