వినోదభరిత ప్రేమాయణం


Mon,January 21, 2019 11:37 PM

uday shankar and aishwarya rajesh new movie opening

ఉదయ్‌శంకర్, ఐశ్వర్యరాజేష్ జంటగా అధిరో క్రియేటివ్ సైన్స్ పతాకంపై ఓ చిత్రం రూపొందుతున్నది. తమిళంలో సలీం చిత్రాన్ని తెరకెక్కించిన ఎన్.వి. నిర్మల్‌కుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం కానున్నారు. జి.శ్రీరామ్‌రాజు, భరత్‌రామ్ నిర్మాతలు. సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. దర్శకుడు మాట్లాడుతూ క్రీడల నేపథ్యంలో సాగే వినోదభరిత కుటుంబ కథా చిత్రమిది. వినూత్నమైన పాయింట్‌తో భూపతిరాజా చక్కటి కథను సిద్ధంచేశారు. కాకాముత్తై, కణాతో పాటు పలు తమిళ చిత్రాలతో ప్రతిభను నిరూపించుకున్న ఐశ్వర్యరాజేష్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్నది. ఆమె పాత్ర ఛాలెంజింగ్‌గా ఉంటుంది అని తెలిపారు. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి ఏప్రిల్‌లో చిత్రీకరణ పూర్తిచేస్తాం. తెలంగాణ, ఆంధ్రాతో పాటు విదేశాల్లో షూటింగ్ జరుపుతాం అని నిర్మాతలు చెప్పారు. సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్ కీలక పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, ఛాయాగ్రహణం: గణేష్ చంద్ర, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌తేజ.

743

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles