సందేశంతో యు


Sun,December 16, 2018 12:29 AM

u movie release on 28th december

స్వీయ దర్శకత్వంలో కొవెరా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం యు. కథే హీరో ఉపశీర్షిక. హిమాన్షి కాట్రగడ్డ కథానాయిక. ఈ నెల 28న విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకహీరో కొవెర మాట్లాడుతూ సమాజంలో ఆర్థికపరమైన నేరాలు ఎలా జరుగుతున్నాయి? వాటి వెనక నడిచే యంత్రాంగం ఏమిటి? అనే అంశాలను చర్చించే సందేశాత్మక కథాంశమిది. తమిళ దర్శకుడు శంకర్ స్ఫూర్తితో ఈ సినిమా తీయడానికి పూనుకున్నాను. సమాజంలోని ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది అన్నారు. తెలుగు తెరపై ఇప్పటివరకు రానటువంటి విభిన్నమైన ఇతివృత్తమిదని, తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుందని స్క్రీన్‌ప్లే రచయిత మధు తెలిపారు. తనికెళ్ల భరణి, శుభలేఖ సుధాకర్, స్వప్నరావు, లహరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాకేష్‌గౌడ్, సంగీతం: సత్య మహావీర్, నిర్మాత: విజయలక్ష్మీ కొండా, రచన-దర్శకత్వం: కొవెరా.

1161

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles