20ఏళ్ల తర్వాత ప్రేమకథతో..


Wed,March 20, 2019 12:06 AM

Twitter Digs Out Old Picture of Baby Alia Bhatt With Salman Khan as They re Paired Together in Inshallah

బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్, దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీది విజయవంతమైన కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన ఖామోషీ, హమ్ దిల్ దే చుకే సనమ్ చిత్రాలు పెద్ద విజయాల్ని సాధించాయి. వీరిద్దరి కలయికలో మరో సినిమా రాబోతున్నట్లు కొంతకాలంగా బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ భన్సాలీతో సినిమా చేస్తున్నట్లు మంగళవారం ట్విట్టర్ ద్వారా ప్రకటించారు సల్మాన్‌ఖాన్. ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ ఆయనతో సినిమా చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. విభిన్నమైన ప్రేమకథతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఇన్షా అల్లా అనే పేరును ఖరారుచేశారు. ఈ చిత్రంలో అలియాభట్ కథానాయికగా నటించనున్నది. భన్సాలీతో పనిచేయాలనే తన కల నిజమవనుందని, అందమైన ప్రయాణంలో భాగం అయ్యేందుకు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నానని అలియాభట్ అని తెలిపింది.

2118

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles