ఫిబ్రవరి 17న టీఎస్‌ఆర్ అవార్డ్స్


Sat,January 12, 2019 11:04 PM

tsr national film awards on feb 17th

టీఎస్‌ఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకను ఫిబ్రవరి 17న వైజాగ్‌లో నిర్వహించబోతున్నట్లు టి. సుబ్బిరామిరెడ్డి ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌లో టీఎస్‌ఆర్ అవార్డుల జ్యూరీ కమిటీ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా జ్యూరీ ఛైర్మన్ సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ 2010 నుండి ఈ అవార్డుల్ని ప్రదానం చేస్తున్నాం. నిర్విఘ్నంగా ఈ వేడుకను కొనసాగించడం ఆనందంగా ఉంది. ఫిబ్రవరి 17న జరుగనున్న ఈ కార్యక్రమంలో 2017, 2018 సంవత్సరాల్లో విడుదలైన చిత్రాల నుంచి ప్రతిభను చాటిన వాటికి పురస్కారాలను అందజేయనున్నాం. ఈ ఏడాది శ్రీదేవి మెమోరియల్ పురస్కారాన్ని విద్యాబాలన్‌కు అందజేస్తాం. ఈ అవార్డుల వేడుకకు రజనీకాంత్, చిరంజీవి, సూర్య, బాలకృష్ణ, వెంకటేష్, విక్రమ్‌తో పాటు పలువురు దక్షిణాది నటీనటులు హాజరుకానున్నారు అని పేర్కొన్నారు. భారతీయ కళలు, సంస్కృతులకు సుబ్బిరామిరెడ్డి ఎనలేని సేవ చేస్తున్నారని సీనియర్ నటి నగ్మా తెలిపింది. త్వరలో తన తండ్రి టి. సుబ్బిరామిరెడ్డి ఆటోబయోగ్రఫీని విడుదల చేయనున్నట్లు పింకీరెడ్డి చెప్పింది. ఈ కార్యక్రమంలో జీవిత, కె.ఎస్.రామారావు తదితరులు పాల్గొన్నారు.

821

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles