గ్లోబల్ సినిమాస్ విడుదల చేస్తున్న భారత్


Sun,May 26, 2019 11:27 PM

tollywood distributor to release salman khans bharat

సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం భారత్. అలీఅబ్బాస్ జాఫర్ దర్శకుడు. కత్రినాకైఫ్ కథానాయిక. ఈద్ పర్వదినాన్ని పురస్కరించుకొని జూన్ 5న ప్రేక్షకులముందుకురానుంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ర్టాల్లో గ్లోబల్ సినిమాస్ అధినేత సునీల్‌నారంగ్ విడుదల చేయబోతున్నారు. ఆయన మాట్లాడుతూ భారత్ చిత్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సీడెడ్‌లో మా సంస్థ ద్వారా విడుదల చేస్తున్నాం. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని వున్నాయి. టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నది అన్నారు. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వరకు భారత్ అనే వ్యక్తి జీవన ప్రయాణానికి దృశ్యరూపంగా ఈ సినిమాను తెరకెక్కించారు. వరుణ్‌ధావన్ అతిథి పాత్రలో నటించారు.

455

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles