ఉత్తమ నటుడు ఎన్టీఆర్ ఉత్తమ నటి సమంత


Mon,June 19, 2017 03:15 AM

-అట్టహాసంగా 64వ ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం

NTR
తారల తళుకుల మధ్య 64వ ఫిలింఫేర్ అవార్డుల వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో దక్షిణాదికి చెందిన ప్రముఖ నటీనటులు పాల్గొన్నారు. అబ్బురపరిచే వస్త్రధారణతో కళ్లు చెదిరేలా ముస్తాబైన తారలు ఈ కార్యక్రమానికి ఆద్యంతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దక్షిణభారతీయ చిత్రపరిశ్రమలోని వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ సందర్భంగా అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, అల్లు అర్జున్, సూర్య, జ్యోతిక, ప్రకాష్‌రాజ్, అల్లు శిరీష్, విజయ్ దేవరకొండ, కార్తి, ఏ.ఆర్. రెహమాన్, సమంత, రకుల్‌ప్రీత్‌పసింగ్, రెజీనా, రాశిఖన్నా, లావణ్యత్రిపాఠి, రానా, కేథరిన్, కృష్ణ, విజయనిర్మల, త్రిష, ఖుష్బూ, మాధవన్, రాహుల్ రవీంద్రన్, చిన్మయి, ప్రణీత, ప్రగ్యాజైస్వాల్, సుహాసిని, జగపతిబాబు, అలీ, సుధీర్‌బాబు, నిక్కిగల్రానీ తదితరులు హాజరై సందడి చేశారు.
NTRALLU

64 ఫిలింఫేర్ అవార్డుల విజేతలు

ఉత్తమ నటుడు: ఎన్టీఆర్ (నాన్నకు ప్రేమతో..)
ఉత్తమ నటి: సమంత ( అఆ)
ఉత్తమ చిత్రం: పెళ్లిచూపులు
ఉత్తమ దర్శకుడు: వంశీ పైడిపల్లి (ఊపిరి)
ఉత్తమ సహాయనటుడు: జగపతిబాబు(నాన్నకు ప్రేమతో..)
ఉత్తమ సహాయనటి: నందితా శ్వేత ఎక్కడికి పోతావు చిన్నవాడా)
ఉత్తమ నేపథ్య గాయకుడు : కార్తీక్(అఆ ఎల్లిపోకె శ్యామలా...)
ఉత్తమ నేపథ్య గాయని : చిత్ర (నేను శైలజ ఈ ప్రేమకి...)
ఉత్తమ గేయ రచయిత : రామజోగయ్యశాస్త్రి (జనతాగ్యారేజ్)
ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ : దేవిశ్రీప్రసాద్ (నాన్నకు ప్రేమతో...)
ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్ అవార్డ్: అల్లు అర్జున్ (సరైనోడు)
ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్ అవార్డ్: రీతూవర్మ (పెళ్లిచూపులు)
Rakull

1935

More News

VIRAL NEWS