దీపికలా కనిపించాలన్నారు!


Tue,April 16, 2019 12:18 AM

To look like that heroine Rakulpreet

ప్రస్తుతం వృత్తిపరంగా ఉన్న పోటీని తట్టుకోవాలంటే పాత్రలపరంగా సవాళ్లకు సిద్ధపడాలని భావిస్తున్నారు కథానాయికలు. పాత్రలకోసం ఎలాంటి ప్రయోగాలకైనా రెడీ అంటున్నారు. తాజాగా పంజాబీ సుందరి రకుల్‌ప్రీత్‌సింగ్ దే దే ప్యార్ దే చిత్రం కోసం పదికిలోల బరువు తగ్గిందట. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా గీతం అందరి దృష్టిని ఆకట్టుకుంది. చూపుమరల్చుకోలేని అందచందాలతో నాయిక రకుల్‌ప్రీత్‌సింగ్ కుర్రకారుని ఫిదా చేసింది. ముఖ్యంగా ఆమె స్లిమ్‌లుక్ గురించి అందరూ చర్చించుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న రకుల్‌ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ చిత్ర దర్శకుడు లవ్‌రంజన్ ఈ సినిమా కోసం నన్ను చాలా సన్నబడాలని కోరారు. మామూలుగా నేను చక్కటి ఫిట్‌నెస్‌ను మెయిన్‌టెయిన్ చేస్తాను.

అయితే పాత్రపరంగా ఇంకా బరువు తగ్గాలని సూచించారు. కాక్‌టెయిల్ సినిమాలో దీపికాపదుకునే మాదిరిగా కనిపించాలని చెప్పారు. ఆయన మాటల్ని ఛాలెంజ్‌గా తీసుకున్నాను. జిహ్వాచాపల్యాన్ని అదుపులో ఉంచుకుంటూ చక్కటి డైట్‌తో పదికిలోల బరువు తగ్గాను. నాజూకు సోయగంతో స్క్రీన్‌పై నన్ను నేను చూసుకొని ఎంతగానో మురిసిపోయాను అని చెప్పింది రకుల్‌ప్రీత్‌సింగ్. దే దే ప్యార్ దే చిత్రంలో అజయ్‌దేవ్‌గణ్, టబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లండన్ నుంచి వచ్చిన అమ్మాయి పాత్రలో రకుల్‌ప్రీత్‌సింగ్ నటిస్తున్నారు. మే 17న ప్రేక్షకులముందుకురానుంది.

1229

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles